Wednesday, January 8, 2014

Politicizing A Death By Senior Artist

Politicizing A Death By Senior Artist | బొగ్గురత్న శవరాజకీయం

బొగ్గురత్న శవరాజకీయం


uday-kiran-death.png

తగనిదేదీ లేదు రాజకీయాలకు అన్న విషయం రాజకీయాల్లోకి పోయిన తర్వాత తెలిసిందో లేకపోతే పుట్టుకతో వచ్చిందో కానీ ఒక బొజ్జ గణపయ్య ఉదయ్ కిరణ్ మరణం మీద శవరాజకీయం చేస్తున్నారంటూ చెప్పుకుంటుంటే ఆసక్తికరంగా అనిపించి దగ్గర్నుంచి వింటుంటే, రోజువారీ పని వత్తిడిలో సమయాభావంతో సామాన్యంగా ఆలోచించని ఎన్నో విషయాలు చెవిలో పడ్డాయి.  టీ దుకాణాల దగ్గర, ఇరానీ హోటళ్ళలో, నలుగురు కలిసే చోట ఉదయ్ కిరణ్ మృతి పట్ల సంతాపాన్ని వెలిబుచ్చుతున్నవాళ్ళలో కొందరు, అదే సమయంలో ఆ విషాద సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్న బొగ్గురత్న మీద ఏవగింపు కూడా వెలిబుచ్చారు.
వాళ్ళంతా అనేది ఒకే మాట!  రాజకీయం చెయ్యటానికి అదా సమయం?  ఒకపక్క విషాద ఛాయలు అలుముకునుంటే ఆ స్థలంలో ఆ సమయంలో ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నట్టుగా నిజ జీవితంలోనే నటించే మనిషి చేసిన వ్యాఖ్యానాలు అందరికీ బాధనిపించిందని అన్నారు.
ఉండబట్టలేక ఎవరండీ మీరంటున్న పెద్దమనిషి? అని అడిగితే, మీకే తెలుస్తుందులెండి అన్నారు వాళ్ళు.  వాళ్ళు ఇంకా ఇలా మాట్లాడుకుంటున్నారు.
ఆయన అన్న సంగతులే మనం చూస్తే అసలు ఉదయ్ కిరణ్ వివాహం విషయంలో నిజంగా జరిగినదేమిటి, ఈయన చెప్తున్నదేమిటి.  కావాలంటే ఆ శవం మీద డబ్బులేరుకోమనండి కానీ వేరే వాళ్ళమీద అనవసరంగా అభాండాలు వెయ్యటం వలన ఈ మనిషికి ఏం ఒరుగతుంది అని అన్నారు.
మెగా స్టార్ చిరంజీవి కూతురుతో జరిగిన ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసారని ఆరోపించిన పెద్దమనిషి తనే ఆ స్థానంలో ఉంటే ఆ విధంగా చేసుండేవారు కాదనే కదా అర్థం!  తన కులానికి చెందిన వాడు కాకపోయినా కూతురితో ఎంగేజ్ మెంటుకి పెద్దమనుసుతో సిద్ధమవటం తప్పా?  ఎంగేజ్ మెంట్ జరిగేటప్పుడు, ఉదయ్ కిరణ్ అంతకు ముందే ఒక అమ్మాయి ప్రేమలో పడ్డారని ఆ విషయాన్ని ఆయనే కాకుండా ఆయన అక్క శ్రీదేవి కూడా ఆ విషయాన్ని దాచి ఎంగేజ్ మెంట్ కి సిద్ధమవటం తప్పు కాదా.  తీరా ఆ ప్రేమించి మోసపోయానని చిరంజీవికి చెప్పేంతవరకూ తెలియదానకి.  ఫిర్యాదు చేసిన అమ్మాయి కూడా తన కూతురులాంటిదే కదా.  మరో అమ్మాయికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎంగేజ్ మెంటుని రద్దు చెయ్యటం తప్పా?
అంటే ఈ బొగ్గురత్న గారు అలా చేసుండేవారు కాదన్న మాట!  తన కూతురు భవిష్యత్తు గురించి తన పేరు ప్రతిష్టల గురించి ఆలోచించి న్యాయం చెయ్యమని వచ్చిన ఆడపిల్లను నయానో భయానో నోరుమూయించుండేవారన్నమాట!  అందుకే చిరంజీవి చేసింది తప్పంటున్నారు!
సరే ఇక ఉదయ్ కిరణ్ కి రావలసిన అవకాశాల గురించి మాట్లాడుకుంటే,  ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కుమార్తె సుష్మితకి 2003 లో ఎంగేజ్ మెంట్ జరిగింది.  2003 నుంచి ఉదయకిరణ్ నటించిన సినిమాలు చాలా ఉన్నాయి అన్నారు వాళ్ళు.  ఇంటికి వచ్చి నెట్ లో చూస్తే కనిపించినవి ఇవి-
2003
1.    జోడీ నం. 1
2.    నీకు నేను నాకు నువ్వు
2004
3.    లవ్ టు డే
2005
4.    అవునన్నా కాదన్నా
2007
5.    వియ్యలవారి కయ్యాలు
2008
6.    గుండె ఝల్లుమంది
7.    ఏక లవ్యుడు
2012
8.    నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
2013
9.    జయ్ శ్రీరామ్
ప్రారంభించిన సినిమా
10.    దిల్ కబడ్డీ
ఇవి కేవలం తెలుగు సినిమాలు.  ఇవి కాకుండా చేసిన మరో రెండు మూడు తమిళ సినిమాలున్నాయి, అవి తెలుగులో డబ్ అయి వచ్చాయి.
నాలుగు కూడళ్ళలో మాట్లాడుకునేవాళ్ళింకా ఇలా చెప్పారు-
సినిమా అవకాశమనేది ఒకళ్ళు ఇస్తే వచ్చేదైతే ఉదయ్ కిరణ్ కి ఆ అవకాశాలు ఎలా వచ్చాయి?  సినిమా పరిశ్రమంతా ఒకళ్ళ దయా దాక్షిణ్యాలమీదనే నడుస్తోందన్నది తప్పు అని చెప్పటానికి పైన చెప్పిన ఉదయ్ కిరణ్ కి వచ్చిన అవకాశాలే కాకుండా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రవితేజలాంటి వాళ్ళకి అవకాశాలెవరిస్తున్నారు?  వాళ్ళ టాలెంట్, ప్రేక్షకుల ఆదరణే కదా!
ఈ సంగతులన్నీ సామాన్య ప్రజానీకానికి తెలియకపోవచ్చుకానీ, సినిమారంగంలోన ఎంతో సీనియారిటీ ఉన్నమనిషికి ఇవన్నీ తెలియవా? ఆయినా ఆ సినిమా ప్రముఖుడు వాటన్నిటినీ తన బొజ్జలో దాచుకుని పైకి అవాకులు చెవాకులు పేలటంలో అంతర్యమేమిటి.  ఆ విధంగా మాట్లాడటానికి ఎన్నుకున్న సమయం అదా.  ఇంగిత జ్ఞానమున్న ఏ మనిషీ అలా చెయ్యడు.  సినిమా రంగ ఉద్ధరణే తన ధ్యేయంగా బయట మాట్లాడేవాడు ఎవడూ చెయ్యడా పని!  లేని అంతరాలను సృష్టించి పబ్బం గడుపుకోవటానికి కళారంగం రాజకీయ క్షేత్రం కాదు అంటూ అక్కడ చెప్పుకుంటున్నవాళ్ళు వివరించారు.
ఫటాఫట్ జయలక్ష్మి ఆత్మహత్యకు ఎవరు కారణమట?  అని అడిగారు వాళ్ళు.  సినిమారంగంలో ఇంకా సిల్కి స్మిత, జియాఖాన్ ల మరణానికి ఎవరు కారకులు? అని కూడా అన్నారు వాళ్ళు.
సినిమా రంగంలో అవకాశాలు రావటం రాకపోవటమనేది ఏ వ్యక్తి చేతిలోనో లేదు.  నటనా చాతుర్యంతో పాటు కాలం కూడా కలిసిరావాలి.  ఎంతో మంది కళాకారులున్నారు ఎవరెవరిని ఆపగలరు ఎవరైనా?.
సరే అలాంటి శక్తే ఉందనుకుందాం.  అలాంటప్పుడు ఈయన ఆరోపించిన హీరోకి కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి కానీ ఈ పది సంవత్సరాలలో ఎన్ని అవకాశాలు వచ్చాయి.  వేరెవరూ సినిమాల్లో కి రాలేదా వాళ్ళు తప్ప అని కూడా ప్రశ్నించారు వాళ్ళు.
తనతప్పులను, ఇరుక్కున్న కుంభకోణాలను పక్కకు పెట్టి ఎదుటివాళ్ళ మీద బురద చల్లితే తన తప్పులు మాసిపోతాయా, మరుగున పడతాయా లేకపోతే ఆ బొగ్గులో మసైపోతాయా అంటూ ఇంకా ఎన్నో విధాలుగా వారికి వచ్చిన భాషలో నచ్చిన విధంగా తిట్టసాగారు.
అయితే చివరకు ఆ మనిషి పేరు కూడా చెప్పారు.  కానీ ఎవరినైనా సరే విమర్శించటం చెయ్యవచ్చేమో కానీ మరీ ఆ విధంగా తిట్టటం రుచించకపోవటం వలన ఆయన పేరు, ఆ తిట్లను కూడా రాయదలచుకోలేదు.
-శ్రీజ

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...

AndhraWishesh Movie Trailer

Telugu Movies's videos on Dailymotion